కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి వినతి ..
జనం న్యూస్ , 7 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో పెద్దమ్మ గుడి కాంపౌండ్ మహిళా కమ్యూనిటీ హల్ కోసం నిధులు కేటాయించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను గాలిపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు ఎండ్ర నారాయణ సంఘం సభ్యుడు కుంభం చంద్ర శేఖర్ సోమవారం రోజున కరీంనగర్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.బండి సంజయ్ మాట్లాడుతూ త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎండ్రా నారాయణ తెలిపారు.ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ కి మత్స్య పారిశ్రామిక సంఘ సభ్యులు మహిళా సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments