వాట్సాప్ ఫేసుబుక్ లో అసభ్యకరంగా పోస్ట్ పెట్టిన వ్యక్తులపై కేసు నమోదు
న్యూస్ పవర్, 19 మార్చి , ఇల్లంతకుంట :
మానకొండూర్ ఎంఎల్ఏ కవ్వంపెల్లి సత్యనారాయణ పాత వీడియోస్ ను అసభ్యకరంగా ఎడిట్ చేసి ఇతరులను రెచ్చగొట్టే విధంగా వాట్సాప్ ఫేసుబుక్ లో అసభ్యకరంగా పోస్ట్ పెట్టిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు
ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు
ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ
పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన కముటం శ్రీధర్ వాట్సాప్ లో మరియు అదే గ్రామానికి చెందిన పసుల బాబు అనే వ్యక్తి పేస్ బుక్ లో పోస్ట్ పెట్టి ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారనీ ఇల్లంతకుంట మండలానికి చెందిన భూంపల్లి రాఘవరెడ్డి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేశామన్నారు
ఇల్లంతకుంట మండలంలో ఎవరైనా ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా, వర్గాల మధ్య రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో మరియు వాట్సాప్ గ్రూపులలో వీడియోస్ గాని, అసభ్యకరమైన, రెచ్చగొట్టే రాతలు రాసి పోస్టులు పెట్టినట్లయితే వారిపై చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ ప్రకటన ద్వారా హెచ్చరించారు.
0 Comments