రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ మహిళా అభ్యర్థులకు ప్రవేట్ కంపెనీల యందు జాబ్
న్యూస్ పవర్ ,12 మార్చి , సిరిసిల్ల :
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ మహిళా అభ్యర్థులకు ప్రముఖ ప్రవేటు కంపెనీ YSK INFOTECH PVT.LTD. ఉద్యోగాలు , కల్పించేందుకు తేదీ 13.03.2025 గురువారం సిరిసిల్ల ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి రాజన్న సిరిసిల్ల అద్వర్యంలో సిరిసిల్ల ఎంప్లాయిమెంట్ ఆఫీసు నందు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ నీల రాఘవేందర్ తెలిపారు. ఎస్ ఎస్ సి /ఇంటర్/ డిగ్రీ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు నెలకు రూపాయలు 15000 ల నుండి 20,000 ల రూపాయల వరకు వేతనం ఉంటుందని తెలిపారు 2 పుటల భోజనం మరియు రవాణా సౌకర్యం ఉచితంగా ఉంటుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ మహిళా అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాఫీలతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేటు లోని f 16 ఎంప్లాయిమెంట్ ఆఫీసు, సిరిసిల్ల నందు తేదీ. 13.03.2025 రోజున ఉదయం 11.00 గంటలకు జరుగు మినీ జాబ్ మేళాకు హాజరుకావాల్సిందిగా తమ నిరుద్యోగ మహిళా అభ్యర్థులను,
శ్రీ నీల రాఘవేందర్ జిల్లా ఉపాధి అధికారి కోరడమైనది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన
ఫోన్.నెం.
7093514418, 9000385863, 9700302582, 9885346768. DEE, SIRCILLA.
0 Comments