న్యూస్ పవర్ , 22 మార్చి , ఇల్లంతకుంట:
బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులతో పాటు ఏఐఎస్ఎఫ్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాుతూ ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదనీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇలాంటి అరెస్టుల వాళ్ళ ప్రతిపక్షాల గొంతు నొక్కడం తప్ప మరేమీ లేదని అన్నారు ప్రజల తరపున ప్రభుత్వాన్ని అడుగుతే అక్రమ అరెస్టులు చేయడం ఏంటి అని తీవ్రంగా ఖండించారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో జారీ చేసిన సర్కులర్ ను వెంటనే వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ముందస్తు అరెస్టు అయినా వారిలో బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు ఎండ్ర చందన్, గుంటి మధు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మంద అనిల్, బండారి చందు, ఆదిత్య ఉన్నారు.
0 Comments