ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు

ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు 
 న్యూస్ పవర్, 21 మార్చి , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మచ్చ రాజేశం బీసీ సెల్ అధ్యక్షుడు ఏఎంసీ వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి జమాల్ శుక్రవారం రోజున 
 పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 
టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద అసత్య ప్రచారం చేస్తూ పబ్బం గడపడానికి మాత్రమే పనిచేస్తారు నిన్న మొన్న జరిగిన చిన్న చిన్న సమస్యలను పెద్ద సమస్యలు గా చేసి చూపించుకుంటూ మా ఎమ్మెల్యే అయిన కవ్వంపల్లి సత్యనారాయణ  పై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు ఎలాంటి అవినీతి చేయకుండా ప్రజాసేవే చేయడమే ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తే ఆయన మీద బురద జల్లడం జరుగుతుంది కానీ. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వారి మీద అబండాలు వేసుకుంటూ తన అవినీతి ఎక్కడ బయట పడుతుందో అని మా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  మీద నిందలు వేయడం మానుకోండి అది మానుకోకుంటే రాబోయే రోజులలో టిఆర్ఎస్ పార్టీ కి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అవినీతి కి పాల్పడిన వ్యక్తులు ఎవరైనా ఉపేక్షించేది లేదు వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తిరుపతి గౌడ్ వీరేశం జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ గౌడ్ ఎలుక అనిల్ కుమార్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కొత్తపెళ్లి బాబు బంగారి ఆంజనేయులు గూడా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments