అగ్గి తెగులు లక్షణాలు కనిపించగానే నివారణ చర్యలు చేపట్టండి
జనం న్యూస్ , 17 మార్చి , ఇల్లంతకుంట :
అగ్గి తెగులు లక్షణాలు కనిపించగానే నివారణ చర్యలు చేపట్టలనివ్యవసాయ విస్తరణ అధికారిని లలిత తెలిపారు
సోమవారం రోజున
ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ మరియు రంగంపేట గ్రామాలలోని రైతులు సాగు చేస్తున్న వరి పంట పొలాలను పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు. యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు మరియు అగ్గి తెగులు లక్షణాలను కూడా గమనించడం అయినది. వరి పంటలో ఆశించే కాండం తొలిచే పురుగు నివారణకు 60 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ మందుని లేదా 400 గ్రాముల కార్టప్ హైడ్రో క్లోరైడ్ మందుని లేదా 120 మి.లీ. ఐసోసైక్లోసీరమ్ మందుని ఒక ఎకరా పొలానికి పిచికారి చేయాలి. అలాగే అగ్గి తెగులు సోకిన పంట పొలాల్లో తాత్కాలికంగా యూరియా వేయడం ఆపివేయాలి. తరువాత ఈ తెగులు నివారణకు ఐసోప్రోతయోలిన్ 300 మి. లీ. మందును ఎకరాకు పిచికారి చేయాలి. ఒకవేళ అగ్గి తెగులు ఉదృతి ఎక్కువగా ఉన్నచో టేబుకోనజోల్+ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 0.4 గ్రాముల లేదా పికాక్సీ స్ట్రోబిన్+ ట్రై సైక్లోజల్ 400 ml మందుని ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అదేవిధంగా గింజ మచ్చ తెగులు గమనించినట్లయితే ప్రోపికొనజోల్ 200 ml మందుని ఎకరాకు పిచికారి చేసుకోవాలన్నారు.
0 Comments