ఏసీబీ విచారణ జరిపించాలి


ఏసీబీ విచారణ జరిపించాలి
• రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు
 
 న్యూస్ పవర్ , 15 మార్చి , ఇల్లంతకుంట :
 అనారోగ్యానికి గురైన బాధితులకు అందాల్సిన చెక్కులు రాబందుల పాలవుతున్నాయి అని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు అన్నారు ఇల్లంతకుంట లో మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ 
 ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కూనబోయిన రవి అనే వ్యక్తి యొక్క 60000ల చెక్కుని రహీంఖాన్ పేట కు చెందిన కత్తి రవి ఖాతాలో జమ చేసుకుని కాంగ్రెస్ నాయకులు గద్దలెక్క పంచుకున్నారనీ
వల్లంపట్ల గ్రామానికి చెందిన ఎల్. శ్రీనివాస్ చనిపోతే 26000ల చెక్కు మంజూరైన ఆ గ్రామ నాయకులు మరో గ్రామానికి చెందిన ఎల్.శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు మీద జమ చేశారు
ఎల్.శ్రీనివాస్ కు సంబంధించిన 26000 చెక్కు డబ్బులు వల్లంపట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పోన్ పే ద్వారా తీసుకున్నాడు.
ఈ దందాలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమేయం ఉంది కాబట్టి నోరుమెదపడం లేదన్నారు 
రహీంఖాన్ పేట సీఎం ఆర్ఎఫ్ చెక్కు గోల్ మాల్ మాల్ విషయములో అసలు దొంగలను వదిలి ఒక గ్రామస్తాయి నాయకున్నీ సస్పెండ్ చేశారనీ
అసలు దొంగలను సస్పెండ్ చేయడంతో పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కేసు నమోదు చేయించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ  మీరు ఏ తప్పు చేయకుంటే ఏసీబీ విచారణ జరిపించి మీ విశ్వసనీయతను నిరూపించుకోవాలి
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దొంగలకు సద్ది కట్టే విధంగా వ్యవహరిస్తున్నారు
ఇప్పటి వరకు సుమారు 50 లక్షల వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణం జరిగినట్లు సమాచారం ఉంది.
మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణం జరుగుతుంది.
ఆరోగ్య ప్రదాత అని చెప్పుకునే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఇదేనా మీ ప్రజాపాలన
ఎమ్మెల్యే గా కవ్వంపల్లి సత్యనారాయణ గెలిచినప్పటి నుంచి ఎన్ని చెక్కులు వచ్చాయో నియోజకవర్గములోని ఏ గ్రామంలో ఎంత మందికి వచ్చాయో లబ్ధిదారులకు ఎంత మందికి డబ్బులు జమ అయ్యాయో ఏసీబీ విచారణ జరిపించాలని కోరుతున్నాం
సీఎం రేవంత్ రెడ్డి ఈ సీఎం ఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణంపై దృష్టి సారించాలి
ఈ చెక్కుల కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు 
ఈ కార్యక్రమంలో బొల్లం వెంకన్న, సాదుల్, కొట్టే వెంకన్న, ఒల్లలా రవి, కూనబోయిన రఘు, కూస నరేష్, దయ్యాల మహేష్, సదువాల సత్యం, సదువాల పర్శరాం, కాదుపాక రాములు,మోండయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments