డిజిటల్ పేమెంట్స్ పై అవగాహన



 డిజిటల్ పేమెంట్స్ పై అవగాహన

 న్యూస్ పవర్ , 12 మార్చి , ఇల్లంతకుంట :
బుధవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లంతకుంట ఆవరణలో  ఆర్బిఐ  యొక్క డిజిటల్ పేమెంట్స్ అవగాహనా వారోత్సవం' లో భాగంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇల్లంతకుంట బ్రాంచ్ వారిచే విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇల్లంతకుంట బ్రాంచ్ మేనేజర్ రమేష్ యాదవ్  మాట్లాడుతూ డిజిటల్ చెల్లింపుల ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలను ప్రజలు చాలా సులభంగా, వేగంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు.
 మరియు డిజిటల్ చెల్లింపుల సమయం లో మోసపోకుండా ఉండడానికి సైబర్ సెక్యూరిటీ గురించి విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, ఎస్ ఎం బి లక్ష్మీనారాయణ రెడ్డి మరియు స్కూల్ హెడ్ మాస్టర్ ప్రేమలత ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments