గ్రూప్ 2 టాపర్ కు గౌడ సంఘ సభ్యుల సన్మానం
న్యూస్ పవర్ , 12 మార్చి , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామానికి చెందిన గొట్టిపర్తి రాకేష్ గౌడ్ గ్రూప్ 2 ఫలితాలలో 24వ ర్యాంకు పొందిన నేపథ్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గౌడ సంఘం సభ్యులు ఆయనను బుధవారం గౌడ సంఘ కార్యాలయంలో శాలువాతో సన్మానించి సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని గౌడ సంఘ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఇల్లంతకుంట గౌడ సంఘ అధ్యక్షుడు కొయ్యడ రాజయ్య, ఉపాధ్యక్షుడు అంతటి రమేష్, ఇల్లంతకుంట మాజీ ఎంపీటీసీ కొయ్యడ భాస్కర్, సంఘం కోశాధికారి ముంజ భాస్కర్, ప్రధాన కార్యదర్శి బండారి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు బండారి సత్తయ్య, సభ్యులు కొయ్యడ లింగయ్య, ముంజ భూపతి, బండారి రాజు, సుధ గోని నాగేంద్ర, అంతటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments