రంగనాయక సాగర్ 11/6 కాలువ సాధన దీక్ష విరమణ

రంగనాయక సాగర్ 11/6 కాలువ సాధన దీక్ష  విరమణ
 న్యూస్ పవర్, 21 మార్చి , ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో రంగనాయక సాగర్ 11/6 కాలువ నిర్మాణం చేపట్టాలని గత 19 రోజులు గా రిలే నిరాహార దీక్ష ను శుక్రవారం రోజున మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లిసత్యనారాయణ  ఆదేశాల మేరకు మరియు ఉన్నంత అధికారుల ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల తాసిల్దార్ మహమ్మద్ ఫారుక్  దీక్ష శిబిరానికి సందర్శించి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామని రైతులు దీక్ష విరమించాలని కోరడం జరిగింది అందుకు రైతులు మాట్లాడుతూ గత 19 రోజులుగా దీక్ష చేస్తున్న ఎవరు పట్టించుకోలేదని ఇప్పటికైనా పట్టించుకున్నందుకు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చిన మాట ప్రకారం కొన్ని నెలల్లో పనులు ప్రారంభించకుంటే తిరిగి తాసిల్దార్  కార్యాలయం ముందు దీక్ష చేస్తామని రైతులు అన్నారు అదేవిధంగా పెద్ద లింగాపూర్ మెట్ట ప్రాంతంలో ఎండిపోయిన వరి చేలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం ఇయ్యాలని అన్నారు 
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డి ఈ సీతారాం  మరియు ఆర్ఐ షఫీ గారు రైతులు
 అమ్ములు అశోక్ గన్నేరo నర్సయ్య పయ్యావుల బాలయ్య గాదే మధు కరికే నవీన్ మహిళా రైతులు లక్ష్మీ అనిత రేనా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments