న్యూస్ పవర్ , 21 నవంబర్, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్లమెంటు కమిటీ సభ్యుడు దామరసత్యం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము 2024 -2026 కు జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నెల 26న వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుపరిపాలన అందించడంతోపాటు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ తెలంగాణలో కనిపిస్తున్నాయి అభివృద్ధి పలాలు అందుకున్న ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ అనేకమంది ఆకర్షితులవుతున్నారు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అమలు చేసిన విధానాన్ని ప్రజలకు తీసుకుపోయి సభ్యత్వ నమోదు వేగం పెంచాలి మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేయాలని సూచించారు రాబోయే స్థానిక ఎలక్షన్లో పార్టీ గెలిపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నారు పార్టీ సభ్యత్వం తో వచ్చే ప్రయోజనాలు సభ్యత్వ రుసుము 100 రూపాయలు మాత్రమే దురదృష్టవషత్తు సభ్యుడు మరణిస్తే ఐదు లక్షల రూపాయల వర్తింపజేస్తుంది తక్షణ సహాయం కింద ఖర్చులకు పదివేల రూపాయలు పార్టీ చెల్లిస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు పార్టీ సభ్యత తీసుకోవాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షుడు అన్నాడీ నరేందర్ రెడ్డి మండల సభ్యులు ఎర్రోజు కిషన్ దొమ్మాటి లక్ష్మణ్ అనుపురం చిరంజీవి నేత చంద్రయ్య రాజిరెడ్డి మైసయ్య వెంకటి ఎల్లోజి తదితరులు పాల్గొన్నారు.
0 Comments