JSON Variables

ప్రదీప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా..

ప్రదీప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా..
 

సిరిసిల్ల పట్టణంలోని ప్రదీప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రంగంలో ఖాళీల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు హెచ్ ఆర్ హెడ్ వినయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక మహతి మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మేళ నిర్వహించబడుతుంది అన్నారు హెచ్ డి ఎఫ్ సి ముత్తూట్ ఫిన్ కార్ప్ కంపెనీలో సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ శాఖలో ఖాళీలను ఈ మేళా ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. కనీసం 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకులు మేళాలో పాల్గొనవచ్చు అన్నారు స్క్రీనింగ్ పరీక్షలు అనంతరం ఎంపికైన వారికి ఏడాదికి 2.5 లక్షల వేతనం లభిస్తుందని అన్నారు. నిరుద్యోగ యువత మేళలో పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తిగల యువత తమ విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్ సెట్ ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇతర గుర్తింపు కార్డుతో నేరుగా మేళాకు హాజరు కావచ్చును అన్నారు పూర్తి వివరాల కోసం 83 74 22 18 04 సెల్ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు

Post a Comment

0 Comments