JSON Variables

పోలీస్ విధులకు ఆటంకపరిచిన ఇద్దరి వ్యక్తుల రిమాండ్

పోలీస్ విధులకు ఆటంకపరిచిన ఇద్దరి వ్యక్తుల రిమాండ్ 


న్యూస్ పవర్ , 15 అక్టోబర్ , ఇల్లంతకుంట :
పోలీస్ విధులకు ఆటంకపరిచిన ఇద్దరి వ్యక్తుల రిమాండ్
చేసినట్లు ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
తేదీ 13/10/2024 నా రాత్రి  ప్రాంతంలో పెద్దలింగాపూర్ గ్రామంలో ఇల్లంతకుంట హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ దుర్గామాత దగ్గర బందొబస్త్ నిర్వహిస్తుండగా ముందుకి పంపించే క్రమంలో పెద్ద లింగాపూర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు గుర్రాల సంతోష్ రెడ్డి ,  సుమన్ రెడ్డి అను వ్యక్తులు మేము వెళ్ళము అని దురుసుగా ప్రవర్తించి డ్యూటీ లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ను నెట్టివేస్తూ తిట్టడం జరిగింది. దీనిపై హెడ్ కానిస్టేబుల్ పిర్యాదు మేరకు కేసు నమోదు చెయ్యడం జరిగింది. ఈ రోజు గుర్రం సంతోష్ రెడ్డి ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయ్యడం జరిగింది.
అంతే కాకుండా ఇల్లంతకుంట లో అదే రోజున డ్యూటీ నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మీదకి దురుసుగా ప్రవర్తించిన ఇల్లంతకుంట కు చెందిన సుధగోని అనిల్ అనే వ్యక్తిని కూడా మంగళ వారం రోజున రిమాండ్ చేయడం జరిగింది. డ్యూటీ లో ఉన్న సిబ్బంది విధులకు ఎవరైన ఆటంకపరిచినట్లాయితే ఉపేక్షించేది లేదనీ హెచ్చరించారు.

Post a Comment

0 Comments