JSON Variables

కాటమయ్య కవచాలతో గీతన్నలకు రక్షణ

కాటమయ్య కవచాలతో గీతన్నలకు రక్షణ


• మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి 

న్యూస్ పవర్ , 24 అక్టోబర్ , కరీంనగర్:
గీత కార్మికుల సంక్షేమం, పరి రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం ఎల్ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో మానకొండూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 250 మంది కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాల కిట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కల్లు గీత ప్రమాదకమైన వృత్తి అని, తాటి చెట్లు ఎక్కి దిగేటప్పుడు ప్రమాదవశాత్తు జారిపడిన సంఘటనలు అనేకం ఉన్నాయ న్నాయన్నారు. ఇలాంటి ప్రమాదా ల్లో కొందరు గాయపడగా, మరి కొందరు మృత్యువాత పడ్డార న్నారు.  తాటి చెట్లపై నుంచి జారిపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి కాటమయ్య రక్షణ కవచాలను తయారు చేయించిందన్నారు. ఇక నుంచి ఏ ఒక్క గీత కార్మికుడు చెట్టుపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోకుండా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాటమయ్య రక్షణ కవచం పేరిట 6 పరికరాలున్న కిట్‌ను అందిస్తున్నామన్నారు. ప్రతి గీత కార్మికునికి రక్షణ కిట్లను అందజేయడం జరుగుతుంద న్నారు. మానకొండూర్ నియోజక వర్గంలో 1600 మంది గీత కార్మికులుండగా, తొలి దశలో 250 మందికి రక్షణ కవచాలు అందించామని, రెండో విడతలో మిగితా వారికి అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు.  తాటి చెట్ల ప్రమాదాల నివారణ కోసం గీత కార్మికులు తప్పనిసరిగా రక్షణ కవచాలను ధరించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు.తొలి విడతలో రక్షణ కవచాలు పొందలేని వారు నిరుత్సాహానికి గురి కావద్దని, అందరికీ ఈ కిట్లు అందజేస్తామని ఆయన చెప్పారు. 
బీసీ సంక్షేమశాఖ జిల్లా అభివృద్ధి అధికారి అనిల్ ఎం.ప్రకాశ్ మాట్లాడుతూ వచ్చే నవంబర్ మాసాంతంలోగా కల్లు గీత కార్మికులందరికీ రక్షణ కవచాలు పంపిణీ చేస్తామన్నారు. రక్షణ కవచాల పంపిణీలోమానకొండూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధగోని లక్ష్మినారాయణగౌడ్, ఒగ్గె దామోదర్, , బత్తిని శ్రీనివాస్ గౌడ్, పడాల శంకరయ్య, గోపు మల్లారెడ్డి, గోపగోని బస్వాగౌడ్, నోముల అనిల్, ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి పి.శ్రీనివాస్ రావు, సర్కిల్ ఇన్ స్పెక్టర్ సాయిబాబా, బీసీ సంక్షేమశాఖ ఏపీసీడబ్ల్యూ టి.సంపూర్ణ, హెచ్.డబ్ల్యూవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments