JSON Variables

పెండింగ్ పి.ఎం.ఎఫ్.ఎం.ఈ రుణాల మంజూరు త్వరితగతిన పూర్తి చేయాలి:::జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ



పెండింగ్ పి.ఎం.ఎఫ్.ఎం.ఈ రుణాల  మంజూరు త్వరితగతిన పూర్తి చేయాలి:::జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ


• పి.ఎం.ఎఫ్.ఎం.ఈ   పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన  జిల్లా కలెక్టర్


న్యూస్ పవర్ , రాజన్న సిరిసిల్ల, అక్టోబర్-23:
జిల్లాలో ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పి.ఎం.ఎఫ్.ఎం.ఈ) క్రింద మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్ కు బ్యాంకర్లు పెండింగ్ రుణాలు మంజూరు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పి.ఎం.ఎఫ్.ఎం.ఈ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

పి.ఎం.ఎఫ్.ఎం.ఈ దరఖాస్తుల స్థితి గతులకు సంబంధించిన నివేదికను, పి.ఎం.ఎఫ్.ఎం.ఈ దరఖాస్తుల స్క్రుటిని , రుణాల మంజూరు, యూనిట్ ఏర్పాటు ప్రక్రియను అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, ఇప్పటివరకు మన జిల్లాలో పి.ఎం.ఎఫ్.ఎం.ఈ సంబంధించి 272 యూనిట్ల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేయగా, 214 యూనిట్లు రుణాల పంపిణీ పూర్తి చేసామని, 170 యూనిట్లు గ్రౌండ్ చేసామని, 119 యూనిట్లకు సబ్సిడీ వచ్చిందని  తెలిపారు. 

2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల దగ్గర పెండింగ్ ఉన్న 73 పి.ఎం.ఎఫ్.ఎం.ఈ దరఖాస్తులను పరిశీలించి త్వరగా అర్హత ప్రకారం రుణాల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు.  మన జిల్లాలో మరో 16 ఆహార శుద్ధి యూనిట్లు (ఫ్లోర్ మిల్లు, ఆయిల్ మిల్, పసుపు కారం తయారీ యూనిట్లు మొదలగు ఆహార శుద్ధి కేంద్రాలు ) ఏర్పాటుకు మంజూరు చేసిన రుణాలు పంపిణీ చేయాలని కలెక్టర్ తెలిపారు. 

గత 3 సంవత్సరాలుగా రుణాలు మంజూరు చేసి సరైన డాక్యుమెంట్లు ఫైల్ చేయని కారణంగా 42 దరఖాస్తులను తిరస్కరిస్తున్నామని బ్యాంకర్లు తెలిపారు. సదరు దరఖాస్తుదారులు మరోసారి ఆహార శుద్ధ యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి కనబరిస్తే నూతనంగా దరఖాస్తు చేసుకోవడానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. 

ఈ సమావేశంలో పి.డి.డి.ఆర్.డి.ఓ శేషాద్రి, ఎల్డీఎం మల్లికార్జున్, ఇన్చార్జి జిఎం డిఐసి భారతి, స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ దివ్యశ్రీ, డిఆర్పి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments