JSON Variables

ప్రతి గింజనూ కొంటాం : ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

ప్రతి గింజనూ కొంటాం : ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి


న్యూస్ పవర్ , 23 అక్టోబర్ , ఇల్లంతకుంట:
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ, నుస్తులాపూర్,బాలయ్యపల్లి, మొగిలిపాలెం, పొలంపల్లి, నర్సింగపూర్, మల్లాపూర్, మన్నెంపెల్లి, పోరండ్ల గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రైతులు పండించే ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొంటుందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో ధీమాగా ఉండాలన్నారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిందని, తరుగు పేరిట రైతులను నట్టేట ముంచిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగా ధాన్యం కొనుగోళ్ల ఏర్పాటును వేగవంతం చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, ఎట్టి పరిస్థితుల్లో దళారులకు అమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి రైతులను కోరారు.  
ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంకిడి లక్ష్మారెడ్డి, కుంట రాజేందర్ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, బండారి రమేశ్, ఎస్.కొండల్ రావు, పోలు రాము, పోలు రమేశ్,గడ్డం రమేశ్, కొత్త తిరుపతిరెడ్డి, మాచర్ల అంజయ్య, డి.సంపత్ రెడ్డి, అలువాల కుమార్, కొత్త రాజిరెడ్డి, సిహెచ్ రవి, లింగయ్య,చిట్టిబాబు, సంపత్, మల్లేశం, యాదయ్య, ఆశిక్ పాషా, ఎస్.సమ్మయ్య, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments