JSON Variables

లోన్ ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరి అరెస్ట్

లోన్ ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరి అరెస్ట్


న్యూస్ పవర్ , 24 అక్టోబర్ , ఇల్లంతకుంట :
లోన్ ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు ఇల్లంతకుంట ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం 
వారం రోజుల క్రితం ఇల్లంతకుంట మండలం లోని పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన బండారి శంకర్, మున్నూరు కాపు అనే వ్యక్తి పిర్యాదు మేరకు కేసు చేయ్యడం జరిగింది. వాళ్ల బంధువు అయినా అదే గ్రామానికి చేందిన కముటం మౌనిక నివాసం సదశివాపల్లి గ్రామం మానకొండూర్ మండలం ఆమె తన తల్లి గారింటికి పెద్ద లింగాపూర్ గ్రామానికి వచ్చినప్పుడు ఒక సంవత్సరం కింద ఆమెకు బ్యాంకు అధికారులతో పరిచయం ఉందని శ్రీధర్ అనే వ్యక్తిని పరిచయం చేసి కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయినా ప్రధాన మంత్రి ముద్రణ యోజన కింద లోన్ ఒక్కొక్కరికి 10 లక్షలు వారం రోజుల్లో ఇప్పిస్తా అని చెప్పి ఇద్దరు కలిసి నమ్మించి మొత్తం 12 మంది దగ్గరి నుండి ఒక్కొక్కరి నుండి 30 వేల చొప్పున మొత్తం 3,45,000/= రూపాయలు వసూలు చేసి తీసుకొని వెళ్ళినారు. తరువాత లోన్ వస్తది అని చెప్పి నమ్మించి మోసం చేస్తారు. అప్పటి నుండి వారు ఇరువురు తప్పించుకొని తిరుగుతూ ఉండగా కేసు నమోదు చేసి ఈ రోజు ఆ ఇద్దరినీ హైదరాబాద్ లో పట్టుకొని తీసుకొని రావడం జరిగింది. ఆమె గురుంచి తెలుసుకోనగా ఆమె పేరు కమటం మౌనిక, 33 సం.,, మున్నూరు కాపు r/o సాధశివాపల్లి అని తెలిసింది. ఆమె సంవత్సరం కింద తన భర్త నుండి వేరుగా ఉంటూ కరీంనగర్ లో జీవిస్తుంది.ఆమెకు అదే సమయం లో కరీంనగర్ కు చెందిన కందుకూరి శ్రీధర్ చారి, 39 సం., కంసాలి అనే వ్యక్తి తో పరిచయం ఏర్పడుతుంది. వీరు ఇరువురు ఎలాగైన సులువుగా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశ్యం తో వీరు ఇరువురు పెద్ద లింగాపూర్ కి వెళ్లి మౌనిక తనకు తెలిసిన వాళ్ళ దగ్గర శ్రీధర్ ను బ్యాంకు అధికారిగా పరిచయం చేసి తాను బ్యాంకు లలో లోన్ ఇప్పిస్తాడు అని చెప్పి నమ్మించి వారికీ తెలిసిన పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన 9 మంది నుండి మరియు రహీంఖాన్ పేట ఒక వ్యక్తి నుండి మరియు కోడిముంజ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నుండి మరియు లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నుండి మొత్తం 3,45,000/- రూపాయలు వసూలు చేసి జల్సాలు చేస్తూ తప్పించుకుంటూ తిరిగినారు. బుదవారం హైదరాబాద్ లో ఉదయం పట్టుకొని ఇరువురు ని పట్టుకొని రిమాండ్ చెయ్యడం జరిగిందనీ. వారి దగ్గరి నుండి రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్ఐ తెలిపారు .

Post a Comment

0 Comments