JSON Variables

పెరటి కోళ్ల పెంపకంతో ఆరోగ్యం ఆదాయం

పెరటి కోళ్ల పెంపకంతో ఆరోగ్యం ఆదాయం 


న్యూస్ పవర్ , 15 అక్టోబర్ , ఇల్లంతకుంట :

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం 
సోమారంపేట గ్రామంలోనీ రాజన్న మదర్ యూనిట్ లో పెంచుతున్న ఆరు వారాల పెరటికోళ్ళను మండలం లోని వివిధ గ్రామాల ఆసక్తి కల సభ్యులకు అమ్మకాలను మంగళ వారం రోజున అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్,డీపీయం సుధారాణి  ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరటికోళ్ళు పెంపకం ద్వారా మన గ్రామీణ ప్రాంంతాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, బ్రాయిలర్ కోళ్ళ కన్నా నాటుకోళ్ళు ఆరోగ్య రీత్యా బాగుంటుందని తెలిపారు. మంచి సంరక్షణ పద్దతులు పాటిస్తూ పెరటికోళ్ళు పెంచడం ద్వారా మరో ఏడు వారాల్లో  గ్రుడ్లు పెడుతాయని తద్వారా కోళ్ళ సంఖ్య పెంచుకోవచ్చని రెండు నెలల తర్వాత కోళ్ళ అమ్మకం ద్వారా రెట్టింపు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. 
మదర్ యూనిట్ ద్వారా పెంచిన పెరటికోళ్ళు 400 గ్రాముల బరువు కలిగినవి 110/- రూపాయలకి ఒకటి చొప్పున అమ్మకానికి సిద్దంగా ఉన్నాయని ఆసక్తి కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మండల సమాఖ్య కార్యాలయం లో జరిగిన మొదటి సమావేశానికి హాజరై సెర్ప్ ద్వారా అమ‌లవుతున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు‌,  బ్యాంకు లింకేజీ, లోకోస్ అజీవిక డిజిటల్ రిజిస్టర్ ఎంట్రీ లాంటి
 అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీయం సుధారాణి, ఎంపీడీవో శశికళ ,ఏపీయం వాణిశ్రీ, సీసీలు రాంచంద్రారెడ్డి, వెంకటేశం, రాజేశ్వరి మండల సమాఖ్య ఓబీలు వీఓఏలు, నిర్వాహకులు కవిత బాలరాజు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments