JSON Variables

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా బతుకమ్మ

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా బతుకమ్మ

  న్యూస్ పవర్ , 2 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరులు సమావేశంలో యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షులుఅంతగిరివినయ్ కుమార్ మాట్లాడుతూ
 ఎక్కడైనా దేవుళ్లను పూజించడానికి పూలను వినియోగిస్తారు కానీ మన తెలంగాణలో పూలనే దేవతగా భావించి  తీరొక్క రంగుల పూలను బతుకమ్మగా పేర్చి గౌరమ్మను పెట్టి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్ట,సుఖాలను పాట రూపంలో పాడుతూ బతుకమ్మ ఆటలాడతారు మహిళలంతా ఈ పండుగను కులo,మతం, ప్రాంతం, పని తేడా లేకుండా మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ గా మొదలై చివరి రోజున సద్దుల బతుకమ్మగా అంబరాన్ని అంటే సంబరాలతో అంగరంగ వైభవంగా నిర్వహిoచుకుంటారన్నారు 

 తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా బతుకమ్మ పండగను నిర్వహించుకుంటున్న ఈ శుభ సందర్బంలో  మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు ఆరోగ్య  డాక్టర్ ||కవ్వంపల్లి సత్యనారాయణ  ఆదేశాల మేరకు గ్రామాలలో ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అవాంఛనియ సంఘటనలు జరగకుండా అధికారులు  పకడ్బoదిగా అన్ని రకాల ఏర్పాట్లు చేసి బతుకమ్మ పండగను  ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకునేలా చూడాలని అధికారులను కోరారు.
అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు మండల అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పర్యవేక్షించాలని  మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు డా||కవ్వంపల్లి సత్యనారాయణ  కోరారు.

Post a Comment

0 Comments