JSON Variables

వాణి నికేతన్ హై స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

వాణి నికేతన్ హై స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు 

 
జనం న్యూస్ , 1 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట  మండల కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలు మంగళవారంఘనంగా నిర్వహించారు. వివిధ రకాలైన పూలతో బతుకమ్మలను పాఠశాల ఆవరణలో పేర్చారు.విద్యార్థులు ఇళ్ల వద్ద నుండి తీసుకోవచ్చున బతుకమ్మలతో పాటు ఉపాధ్యాయినీలు పేర్చిన బతుకమ్మలను అందంగా అలంకరించిన ముగ్గులోపెట్టారు.బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు. విద్యార్థుల కోలాటం. దాండియా నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు సాంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం గ్రామ సమీపంలోని బతుకమ్మ తిప్ప వద్ద నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి. ఉపాధ్యాయనీలు  సుమంగళి. శోభ.రేఖ.కళ్యాణి.లావణ్య.మహాలక్ష్మి. సునంద.మౌనిక.రేణుక.ఉష.పద్మ. శాంత.జలజ.స్వాతి. షమీమా లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments