JSON Variables

వెంకట్రావు పల్లె గ్రామ ప్రజలకు న్యాయం చేయాలి



వెంకట్రావు పల్లె గ్రామ ప్రజలకు న్యాయం చేయాలి 

జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత

న్యూస్ పవర్ , 24 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
ఉమ్మడి గొల్లపల్లి గ్రామపంచాయతీ లో భాగంగా 2018 సంవత్సరంలో నూతన గ్రామ పంచాయతీగా వెంకట్రావు పల్లె ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కి వెంకట్రావు పల్లె గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని  డిమాండ్ ను విన్నవించడం జరిగింది. 
ఈ సందర్భంగా మాజీ సర్పంచి అనగోని యాదగిరి గౌడ్ మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీ పాలకవర్గానికి గాని మా గ్రామ ప్రజలకు గాని తెలవకుండా నూతన గెజిట్ అని చెప్పి గ్రామపంచాయతీలో అతికేసి చెప్పడం జరిగినది. గతంలో గొల్లపల్లి కి ఎంపిడిఓ  ఇన్చార్జిగా ఉండి స్పెషల్ పాలన లో ఎమ్మార్వో  రెండు గ్రామపంచాయతీలకు గొల్లపల్లి వెంకట్రావుపల్లె కు ఇన్చార్జిగా ఉన్నారు.ఇప్పుడు కొత్తగా గెజిట్ వచ్చిందని చెప్పడం ఏమిటని ప్రశ్నించి వివరించడం జరిగినది. యధావిధిగా 2018లో గ్రామపంచాయతీ ఏర్పడిన సరిహద్దుల విధముగా ఉండాలని పాత గెజిట్ ప్రకారమే ఓటర్ లిస్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. 2018 సంవత్సరం ప్రకారం నూతన ఓటర్ జాబితా మరియు రెవెన్యూ సరిహద్దులు నిర్ణయించాలని కోరుకుంటున్నాం అన్నారు. పార్ట్ ల పేరుతో రెవెన్యూ సరిహద్దులను మార్చడం సరికాదన్నారు. గతంలో ఉన్న ఇంఛార్జి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి విన్నమించుకున్నారు. ఇట్టి విషయం పై జిల్లా కలెక్టర్  సానుకూలంగా స్పందించి మండల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు యువత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments