JSON Variables

సమతుల ఆహారం తీసుకోవాలి

సమతుల ఆహారం తీసుకోవాలి


• పోషణ్ మాస్ పై సమీక్ష సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 20, 2024:
బాలికలు, గర్భిణులు, బాలింతలు సమతుల ఆహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పోషణ్ మాస్ పై జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్త్రీ  శిశు సంక్షేమ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఎనిమియా నిర్ధారణ పరీక్షలపై ఆరా తీశారు. ఇప్పటివరకు ఎంతమందికి పరీక్ష చేశారో అనే వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం బాలికలు గర్భిణులు బాలింతలు కలిపి 34 వేల మంది ఉండగా, ఇప్పటివరకు 17, 820 మందికి పరీక్షలు చేశారని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 
 అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రక్త శాతం తక్కువ ఉన్న వారికి ఐరన్,  క్యాల్షియం టాబ్లెట్లు ఇప్పించాలని,  ఆకుకూరలు, బెల్లం ఖర్జూర తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలి
ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో లబ్ధిదారులందరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వారిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థలం ఉన్న అంగన్వాడి కేంద్రాల్లో కిచెన్ గార్డెన్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు. కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెట్టేలా చూడాలని సూచించారు. రక్తహీనత పోషకాహర లోపంతో ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. అంగన్వాడి కేంద్రాల్లో పోషకాహార పదార్థాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆహార పదార్థాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ఇక్కడ సిడిపివోలు, సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments