JSON Variables

గురుకులలో మౌలికవసతుల కల్పించాలి

గురుకులలో మౌలికవసతుల కల్పించాలి
• భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్

న్యూస్ పవర్ , 21సెప్టెంబర్ , ఇల్లంతకుంట:
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్  శుక్రవారం రోజున గాలిపల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్ పాముకాటుకు గురైన విద్యార్థి  చదువుతున్న బీసీ హాస్టల్ ను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.హాస్టల్లో సరైన సిబ్బంది కొరత మరియు రాష్ట్రవ్యాప్తంగా అనేక గురుకుల పాఠశాలలో అనేక సంఘటనలు జరుగుతున్న ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం  స్పందించడం లేదు ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం చాలా దురదృష్టకరం సిగ్గుచేటు అని మండిపడ్డారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సరైన భోజన వసతులు కల్పించి సరైన సిబ్బంది నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది లేనిపక్షంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరుపున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ సోషల్ మీడియా గాలిపల్లి ఇన్చార్జి నరేష్  బిఆర్ఎస్వి నాయకులు టి శ్రీనివాస్ వావిలాల సాయికుమార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments