JSON Variables

విద్యార్థికి ఆర్థికసహాయం అందజేత

 విద్యార్థికి ఆర్థికసహాయం అందజేత

• మానవత్వం చాటుకున్న దాతలు

• రూ.59వేలు అందజేత

న్యూస్ పవర్ , 24 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
పాముకాటుతో ఎల్లారెడ్డిపేట అశ్వీని హస్పీటల్ లో చికిత్స పొందుతున్న బీసి హాస్టల్ 6వతరగతి గిరిజన విద్యార్థి రమావత్ రొహిత్ కు దాతల సహాయంతో జమ చేసిన ఆర్థిక సహాయాన్ని, విద్యార్థి తల్లి సుశీల(రజిత) కు సోమవారం ఇవ్వడం జరిగింది. 
సామాజీక మాద్యమాల ,ఫోన్ ద్వారా స్పందిచిన దాతలు రూ.59000 వేల రూపాయలను సహాయం అందిచండం జరిగింది. దాతల ద్వారా  స్వీకరించిన మొత్తం అమౌంట్ ను  గాలిపెల్లి హైస్కూల్ హెచ్ ఎం పావని మేడమ్ ఉపాధ్యాయులు అయ్యన్నగారి హరికృష్ణ రెడ్డి అన్న, తుంకుంట నరేందర్ రెడ్డి సార్ , వార్డెన్ గంగయ్య గారి సమక్షంలో  అమౌంట్ ను విద్యార్థి తల్లి,కుటుంబ సభ్యులకు అందివ్వడం జరిగింగి. మానవత దృక్పధంతో,  అపన్నహస్తం అందించిన దాతలందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని  తల్లి రజిత, కుంటుంబ సభ్యులు.

Post a Comment

0 Comments