JSON Variables

పత్తిలో రసం పిలిచే పురుగులపై అవగాహన సదస్సు

పత్తిలో రసం పిలిచే పురుగులపై అవగాహన సదస్సు

న్యూస్ పవర్ , 23 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
జిల్లా ఏరువాక కేంద్రం కరీంనగర్ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం ఇల్లంతకుంట, మండలంలోని పెద్ద లింగాపూర్, గ్రామంలో పత్తిలో రసం పిలిచే పురుగులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రైతులు సాగు చేస్తున్న ప్రత్తి మరియు వరి పంటలను పరిశీలించడం జరిగింది. ప్రత్తిలో కాయ కుళ్ళు తెగులు గమనించడం జరిగింది. అంతేకాకుండా ప్రత్తిలో ఆకుమచ్చ మరియు రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని గుర్తించడం జరిగింది. ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు ప్రోఫీకోనజోల్ 200 ఎంఎల్ ఎకరానికి పిచికారి చేయాలి. అదేవిధంగా కాయ కుళ్ళు తెగులు నివారణకు ప్లాంట్ మైసిన్ 0.2గ్రా మరియు కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రా/లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలిఎసిటమిపీల్చే పురుగుల నివారణకు ఎసిటమి ప్రైడ్ 0.2 గ్రా/ లీటరు నీటికి లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రా/లీ నీటికి మరియు వేప కాషాయం 1000 ఎంఎల్ ఏకరానికి మందును పిచికారి చేయాలి.
అదే విధంగా వరిలో ప్రధానంగ వచ్చే మొగి పురుగు లక్షణాలను శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. మొగి పురుగు నివారణకు చేపట్టవలసిన చర్యలను తెలియజేయడం జరిగింది. దీని నివారణకు కార్టప్ హైడ్రో క్లోరైడ్ 400 గ్రా/లీ నీటికి లేదా క్లోరాoత్రనిలిప్రోల్ 60 మి.లి/ ఎకరానికి పిచికారి చేసుకోవాలి.
సుడి దోమ నివారణకు డైనోటెఫ్యూరాన్ 80 గ్రా/ఎకరానికి పిచికారి. ఈ క్షేత్ర సందర్శనలో భాగంగా శాస్త్రవేత్త డా. ఏం. రాజేంద్రప్రసాద్, డా . కె . మదన్ మోహన్ రెడ్డి శాస్త్రవేత్త మరియు కో ఆర్డినేటర్, వ్యవసాయ విస్తరణ అధికారి జ్యోతి, మాజీ సర్పంచ్ జితేందర్ మరియు రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments