73వ,భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
73వ,భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని అంబేద్కర్ & ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత, డా" బి. ఆర్ అంబేద్కర్ నీ స్మరిస్తూ మహనీయుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించడం జరిగింది
ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ సావనపెల్లి రాకేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే రాజ్యాంగ స్ఫూర్తి పరిడ విల్లుతుంది,అంటరానితనం అనే సామాజిక రుగ్మతను స్వయంగా ఎదుర్కొని దేశ ప్రజలందరికీ సామాజిక న్యాయం అందేలా రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి డా" బి. ఆర్ అంబేద్కర్ అని అన్నారు, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరణలో చేసి చూపుతున్న గొప్ప నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ,అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే గొప్ప ఆలోచన తో ముఖ్య మంత్రి పాలన సాగుతోందని అన్నారు,60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిస్తే,అంబేద్కర్ ఆశయాలను అక్షరాలా అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి తెలంగాణ అపర భగీరతుడు , ముఖ్యమంత్రి ,అణగారిన వర్గాలకు గుర్తింపు, గౌరవం కోసం,రాజ్యాంగాన్ని అందజేశిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఇల్లంతకుంట మండల ఏఎంసి ఛైర్మెన్ మామిడి సంజీవ్ , ఎంపిటిసి సభ్యులు ఒగ్గు నర్సయ్య యాదవ్ ,కోప్షన్ మెంబర్ ఎండి సలీమ్ ,ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ఎండి సాదుల్ అంబేద్కర్ & ప్రజా సంఘాల నాయకులు దొంతుల శంకర్,అంతగిరి భాస్కర్, ఎండి ఉస్మాన్,చాతర్ల మహేందర్, కాసుపాక దుర్గయ్య,గొడుగు హరికుమార్ కాసుపాక రాములు కూనబోయిన రఘు,తిప్పారపు శ్రీనివాస్,దయ్యాల రామకృష్ణ,సంపత్ రెడ్డి, శ్రీనివాస్,సతీష్,విక్కీ,జెని,సమీర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments