JSON Variables

మంత్రి హరీష్ రావు సభను విజయవంతం చేయండి

 మంత్రి హరీష్ రావు సభను విజయవంతం చేయండి


• గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో బాగంగా వికలాంగులకు 6స్కూటీలు పంపిణీ 
• 2 బ్యాటరీ సైకిల్లు గ్రామానికో క్రికెట్  కిట్ పంపిణీ 
• తెలంగాణ ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్  ఇస్తున్న ఆత్మీయ కానుక బతుకమ్మ చీర
 • ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

న్యూస్ పవర్ , 5 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో  హెలీప్యాడ్ స్థలాన్ని సభా ప్రాంగనాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు  ఇల్లంతకుంట మండలానికి చెందిన అన్ని గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసి లు,బీఆర్ ఎస్ పార్టీ గ్రామాశాఖ అధ్యక్షులు జిల్లా మండల ముఖ్యనాయకులతో సమావేశమై శుక్రవారం ఇల్లంతకుంట మండల కేంద్రానికి  మంత్రి తన్నీరు హరీష్ రావు  పలు అభివృద్ది పనుల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలకు విచ్చేయుచున్న సందర్భంగా గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి మంత్రి  సభను విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారు అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణి చేశారు ఉపాధి లేక ఆకలితో సతమతమవుతున్న చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు రాష్ట్రంలోని ప్రతి మహిళ పండుగకు కొత్త బట్టలు కట్టుకోవాలన్న ఉద్దేశంతోనే బతుకమ్మ చీరెలు అందిస్తున్నామని అని అన్నారు. ఆత్మగౌరవంతో బతుకాలని ప్రభుత్వం తరఫున ముస్లిం, క్రిస్టియన్ల పండుగలకు కొత్త బట్టలు పంపిణీ చేశామని, ఇవ్వాళ తెలంగాణ అడపడుచులకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నామని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు స్థానిక ఎంపిటిసి ఒగ్గు నర్సయ్య యాదవ్ స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలరాజు వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పార్టీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments