JSON Variables

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

• వివిధ గ్రామాల నుండి  యువకుల చేరిక 
• కండువా కప్పి ఆహ్వానించిన  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ


న్యూస్ పవర్ , 3 అక్టోబర్ , ఇల్లంతకుంట :

ఇల్లంతకుంట మండలం జవారిపేట,సోమారంపేట గ్రామానికి చెందిన జెట్టి మల్లేశం‘జెట్టి యశ్వంత్ ఆధ్వర్యంలో సుధాగోని రోహిత్, గౌరవనీ శ్రీకాంత్, జెట్టి భాను, వినయ్, మూడపల్లి వంశీ, మూడపెల్లి అనిల్,పలుమారి ప్రశాంత్,హరీష్,రాము ఆధ్వర్యంలో 100.. మంది యువకులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కవ్వంపల్లి సత్యనారాయణ  మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి అహర్నిశలు కృషి చేయాలని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసుల వెంకటి ఎంపిటిసి కరివేద సప్న కరుణాకర్ రెడ్డి  పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మామిడి నరేష్, మైనారిటీ అధ్యక్షుడు జమాలబడుగు లింగం కిసాన్ సెల్ సురేందర్ రెడ్డి కాష్పక రమేష్ అన్నాడి  తిరుపతి కుమార్ తాట్ల వీరేశం కవ్వంపల్లి స్వామి వివిధ గ్రామాల శాఖల అధ్యక్షులు  సంపత్ రెడ్డి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments