JSON Variables

మంత్రి హరీష్ రావు పర్యటనను అడ్డుకుంటాం

 మంత్రి హరీష్ రావు పర్యటనను అడ్డుకుంటాం

 న్యూస్ పవర్ , 5 అక్టోబర్ , ఇల్లంతకుంట :
శుక్రవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘాలరాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ సావనపెల్లి రాకేష్ ఒక ప్రకటనలో తెలియజేస్తూ  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  అధికారం లోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచిన నేటికీ దళిత కుటుంబాలు అభివృద్ధి కి నోచుకోలేదు,మళ్ళీ దళిత బంధు పథకం పేరిట 10 లక్షలు ఇస్తామని చెప్పుకుంటూ ఓట్లు దండుకొని అధికారం లోకి రాగానే మళ్ళీ ముచ్చట గా మూడవ సారి మోసం చేయాలనీ చూస్తున్నాడు ఎస్సీ రిజర్వేషన్ లో ఉన్నత పదవులు అనుభవిస్తూ స్వార్ధ రాజకీయాల కోసం దళితులను రాజకియంగా అణచివేస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోసం మంత్రి  హరీష్ రావు  ఇల్లంతకుంట పర్యటన కు రావడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కేవలం ఓట్ల కోసమే రావడం చాలా సిగ్గు చేటు, మీ సిద్ధిపేట నియోజకవర్గం లో దళిత కుటుంబాలకు ఎక్కువ మొత్తం లో దళిత బంధు పంపిణి చేశారు, మానకొండూర్ నియోజకవర్గం లో దళిత బంధు ఎందుకు పంపిణి చేయడం లేదు ఓట్లు వస్తే తప్ప ఇల్లంతకుంట మండల సమస్యలు పట్టించుకోని మీరు మా మండలానికి రావొద్దని హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో లో అఖిల పక్షం & దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటామని తెలిపారు .

                 
  

Post a Comment

0 Comments