రేపాక క్లస్టర్ లో ఘనంగ రైతు దినోత్సవ సంబురాలు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ రోజు ఇల్లంత కుంట మండలం లోని రేపాక క్లస్టర్ పరిధి లో రైతు వేదిక లో రైతు దినోత్సవం నిర్వహించడం జరిగింది.ముందుగా గ్రామం లో రామాలయం నుండి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ లతో రైతులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. తదుపరి జాతీయ గీతాలాపన తో మొదలైన కార్యక్రమం లో భాగంగా ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ రొండ్ల తిరుపతి రెడ్డి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర అవతరణ కు ముందు మరియు రాష్ట్ర అవతరణ తర్వాత వ్యవసాయం లో గల అభివృద్ధి ని ఉద్దేశించి తెలియజేయడం జరిగింది.మరియు వ్యవసాయ శాఖ లోనీ రైతు భీమా పధకం లో భాగంగా రైతు ఎవరైనా మరణిస్తే వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు నామినీ ఖాతా లో జమ అవుతున్నాయని ఇలాంటి పథకం మునుపెన్నడూ లేదని పథకం యొక్క ప్రాముఖ్యత తెలియ చేయడం జరిగింది. పంట మార్పిడి లో భాగంగా ఆయిల్ పామ్ సాగు ను ప్రోతహించడం జరిగింది.అనంతరం వ్యవసాయ విస్తరణ అధికారి రవళి గత 6 ఏళ్లలో క్లస్టర్ లో జరిగిన ప్రగతి నివేదిక చదివి వినిపించడం జరిగింది. రైతు భీమా పధకం లబ్ది దారులు ,మరియు అతిథుల ఉపన్యాసం ముగిసిన తదుపరి ఉత్తమ రైతులకు ప్రోత్సాహక సన్మానం చేయడం జరిగింది.అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, అధికారులు, రైతులు అందరూ కలిసి సహా పంక్తి భోజనం చేసి కార్యక్రమం ముగించడమైనది.
కార్యక్రమం లో రేపాక సర్పంచ్ రోండ్ల లక్ష్మి , సోమారం పేట సర్పంచ్ కాచం శ్రీనివాస రెడ్డి, అరేపల్లి సర్పంచ్ చింతల పెళ్లి తిరుపతి రెడ్డి, వెంకట్ రావు పల్లి సర్పంచ్ మంద సుశీల లింగం,ఉపసర్పంచ్ రాచకొండ అనిల్, వ్యవసాయ విస్తరణ అధికారి రవళి, పంచాయితీ కార్యదర్శులు,అన్ని గ్రామాల రైతులు పాల్గొనడం జరిగింది.
0 Comments