అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
న్యూస్ పవర్ , 26జూన్ , ఇల్లంతకుంట :
మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ చంద్రకళ మాట్లాడుతూ ఈ రోజుల్లో 10వ తరగతి, ఇంటర్ చదివే పిల్లలు , యువత మాదకద్రవ్యాల కు అలవాటు పడుతున్నారని దీనివలన వారు శారీరకంగా మానసికంగా దెబ్బతింటున్నారని, కనుక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ,పెద్దలు గమనిస్తూ, ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలని మరియు యువత ఇలాంటి చెడు అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ మీర్జా , ఎమ్మార్వో నరేందర్ , ఎస్ఐ రాజేష్, , ఐసిడిఎస్ సూపర్వైజర్లు చంద్రకళ, సూర్య కళ, శ్రీలేఖ దేవి, ఐసిపిఎస్ సంపత్, అంగన్వాడీ టీచర్లు, మరియు యువతి యువకులు పాల్గొన్నారు.
0 Comments