కళ్యాణ లక్ష్మి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే రసమయి

 కళ్యాణ లక్ష్మి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే రసమయి 

న్యూస్ పవర్, 7 జూన్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం జంగం రెడ్డి పల్లిగ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన కుమ్మరవేణి బుచ్చయ్య- కళ కూతురు అఖిల  వివాహానికి ముందస్తుగా ఒకరోజు ముందు కళ్యాణ లక్ష్మి చెక్కును ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో  అందజేసిన తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్   రసమయి బాలకిషన్, .స్థానిక సర్పంచ్ తూముకుంట శ్రీలత నరేందర్ రెడ్డి పెళ్లి కూతురు ఆర్థిక పరిస్థితి  గురించి  మానకొండూర్  శాసనసభ్యులు డాక్టర్  రసమయి బాలకిషన్  కి తెలియజేయగానే ఆయన వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి పెళ్లికి ముందు 1,00116/ రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కును అందజేశారు. ఈ చెక్కు మంజూరి కి కృషి చేసిన మానకొండూర్  శాసనసభ్యుడు డాక్టర్  రసమయి బాలకిషన్  కి స్థానిక సర్పంచ్ తూముకుంట శ్రీలత నరేందర్ రెడ్డి  కు కళ్యాణ లక్ష్మి చెక్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్   సిద్ధం వేణు  ,ఇల్లంతకుంట మండల పరిషత్ అధ్యక్షులు  ఊట్కూరు వెంకటరమణారెడ్డి ,ఉప సర్పంచ్ ఎల్లయ్య వార్డు సభ్యులు నారాయణ , గ్రామస్తులు పాల్గొన్నారు.



లోకల్ Ads:

Post a Comment

0 Comments