సీపీఎం జిల్లాస్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయండి

సీపీఎం జిల్లాస్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయండి

 న్యూస్ పవర్, 7 జూన్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంటలో ఈ నెల 9 10 తేదీల్లో పెద్ద లింగాపూర్ లో జరగబోయే సీపీఎం జిల్లాస్థాయి శిక్షణ తరగతులు కరపత్రం గన్నేరo నర్సయ్య సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని అలాగే నాలుగు లేబర్ కోడ్ ల తీసుకొచ్చి కార్మికుల ఉద్యోగ భద్రతకు భంగం కలిగిస్తుందని అన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇంటికో ఉద్యోగం ఇస్తామని రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నో వాగ్దానాలు ఇచ్చి నేటికీ ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు నేడు కొనుగోలు సెంటర్లో రైతుల పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉందని క్వింటాల్కు 8 కిలోల తరుగు తీస్తున్న పట్టించుకునే ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు గాని లేరని అన్నారు జిల్లావ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పోడు సాగుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సమావేశంలో నిర్ణయించడం జరుగుతుందని కావున ప్రజలు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు 
 ఈ కార్యక్రమంలో నాయకులు సావనపల్లి రాములు స్వామి అంజి కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.



లోకల్ ads:

Post a Comment

0 Comments