మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో నిరుపేద యువతీ వివాహానికి పుస్తె మట్టలు అందించిన గడ్డం నాగరాజు , వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశదిన ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తున్నారు చెప్పాలని డిమాండ్ చేశారు, తెలంగాణ ప్రజలను ఏమి ఉద్ధరించారో, తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకా, నిరుద్యోగ భృతి ఇవ్వనందుక, యువతను నిరుద్యోగులుగా మార్చినందుకు, రైతులకు ఇస్తానన్న నష్టపరిహారం ఇవ్వనందుక , రైతులకు రుణమాఫీ చెయ్యనందుక, రైతులను దోపిడీ చేస్తూ రైతులను అన్నమో రామచంద్ర అన్న విధంగా తయారు చేసినందుక నీళ్లు నియామకాలు నిధులు లేక తెలంగాణ ప్రజానీకం అరిగోసాలు పడుతూ ఉన్నందుక లేక కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తింటూ అవినీతి పాలనతో అందాలమెక్కిన మీకు, మీ పాలకుల కోసమా ఈ దశాబ్ది ఉత్సవాలు అని ప్రశ్నించారు. ఇక మానకొండూరు నియోజకవర్గం లో అభివృద్ధి ప్రదాత అని చెప్పుకు తిరిగే శాసనసభ్యులు రసమయి బాలకిషన్ తన వ్యక్తిగత అభివృద్ధి నియోజవర్గ అభివృద్ధిల కనబడుతున్నట్టు ఉందని ఎద్దేవ చేశారు మానకొండ నియోజకవర్గం ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని రానున్న రోజుల్లో మానకొండూరు గడ్డపై బీజేపీ జెండా ఖాయమని తెలిపారు. వీరి వెంట మండల అధ్యక్షుడు సంతోష్, మండల ఉపాధ్యక్షుడు భూమల్ల అనిల్, లోకోజ్ చంద్రం శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
0 Comments