పదవ తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్ అందజేత
వాసంతి దేవి చారిటబుల్ ట్రస్ట్ , ఎస్ వెంకట రామారావు ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ వారి ద్వారా శుక్ర వారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాచారం
నందు పదవ తరగతిలో ప్రథమ స్థానం నిలిచిన
గౌరవేణి వైష్ణవికి 50,000/-రూ"ల నగదు,
ద్వితీయ స్థానం నిలిచిన సూదుల రాఖీకి 15000/-రూ"ల నగదు,
తృతీయ స్థానం నిలిచిన గజ్జల పవన్ , శ్రీరాముల దీపిక ఇరువురికి 10,000/-నగదు విద్యార్థులకు ట్రస్టు సభ్యులు దామెర భరత్ , దామెర శరత్ , జోగిని పెల్లి శ్రవణ్ , సురభి నరసింగారావు , ట్రస్ట్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి నగదు అందజేశారు .ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐరెడ్డి ప్రదీప్ రెడ్డి , గ్రామ సర్పంచ్ పొన్నం పరుశురాం గౌడ్ , ఎంపిటిసి బర్ల తిరుపతి , ఎస్ఎంసి చైర్మన్ మారవేణి రమేష్ , రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు వాడే సంజీవరెడ్డి , ఉప సర్పంచ్ వాడే సుమతి కాంత రెడ్డి , సురభి కమలాకర్ రావు ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments