అకాల వర్షంతో ఈదురు గాలులతో నష్టపోయిన వాటిని పరిశీలించిన ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి
న్యూస్ పవర్ , 3 జూన్ , ఇల్లంతకుంట :
అకాల వర్షంతో ఈదురు గాలులతో సోమారం పేట, వెంకట్రావుపల్లి, గొల్లపల్లి గ్రామాలలో నష్టపోయిన వాటిని ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి పరిశీలించారు. రోడ్డుపై ఈదురు గాలులతో విరిగిపడ్డ చెట్లను వెంటనే అధికారులతో మాట్లాడి తొలగింప చేశారు. అదేవిధంగా పాల కేంద్రంలో పూర్తిగా రేకులు గాలికి కొట్టుకపోవడంతో పరిశీలించారు ఇదే గ్రామంలో బొడిగె రవి కురుపుల చంద్రయ్యకు సంబంధించిన ఇంటి రేకులు కూలిపోవడం జరిగినది. అనంతరం స్థానిక తాసిల్దార్ గారితో , సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంద సుశీల లింగం ,ఫ్యాక్స్ డైరెక్టర్ చల్ల నవీన్ రెడ్డి ,అనగోని యాదగిరి గౌడ్ ,కడగండ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
0 Comments