అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య

అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య

న్యూస్ పవర్ , 15 జూన్ , ఇల్లంతకుంట ;
ఉరి వేసుకొని ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామానికి చెందిన పల్లె నాగరాజు వయస్సు 36 సంవత్సరాలు తండ్రి పల్లె లస్మయ్య అను అతను గురువారం మృతి చెందాడు. ఈ మేరకు ఇల్లంతకుంట ఎస్సై  రాజేష్  సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు. భార్య నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు  ఏ ఎస్సై  తెలిపారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో మృతుడు బాధ పడుతున్నాడని అదే విధంగా కరీంనగర్లో ఇటీవల ఇల్లు కొనుగోలు చేసే క్రమంలో రెండు లక్షల రూపాయలు అప్పు అవడంతో తీవ్ర మనస్థాపనతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు ఏ ఎస్సై మోతీ రామ్  తెలిపారు.

Post a Comment

0 Comments