ఠాణా దివస్ ను సద్వినియోగం చేసుకోండి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో జూలై 4న నిర్వహించే ఠాణా దివస్ కార్యక్రమాన్ని ఇల్లంతకుంట మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఒక ప్రకటనలో తెలిపారు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని, ప్రజల నుండి స్వయంగా విన్నపాలు స్వీకరించి, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం కోసం చేపట్టిన ఠాణా దివస్ కార్యక్రమంలో భాగంగా జూలై 4 మంగళవారం రోజున ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో ఉదయం 10:30 గంటల నుండి అందుబాటులో ఉండి మండల ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి,దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను,గ్రామాల్లో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలను చట్టపరంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు.మండల పరిధిలోని గ్రామాల ప్రజల ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు,ఫిర్యాదులను తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవలసిందిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
0 Comments