ఘనంగా రైతు దినోత్సవ సంబరాలు
ఇల్లంతకుంట మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు తెలంగాణ రైతు దినోత్సవాన్ని ఎడ్ల బండ్లతో ర్యాలీ ఘనంగా నిర్వహించారు. రైతు బీమా,రైతు బంధు దేశానికి ఆదర్శం అని ఇల్లంతకుంట మండల ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు .ప్రపంచ దేశాలే ఆశ్చర్య పోయే ప్రాజెక్టులతో బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అమలు చేస్తున్న అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం భారత దేశంలో ఎక్కడా లేని విదంగా ప్రస్తుతం ఉన్న 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో కూడా అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ రాష్ట్రం నేడు ప్రపంచ దేశాలకు రోల్ మోడల్ గా ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఒగ్గు నరసయ్య, వనజ, సర్పంచులు కొనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, తూముకుంట శ్రీలత నరేందర్ రెడ్డి , ఎలుక లక్ష్మీ స్వామి, కట్ట వెంకటరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు సలీం,జిల్లా కోపరేటివ్ ఆఫీసర్ అరుణ్ జ్యోతి, రైతుబంధు నెంబర్లు భూపతిరెడ్డి, రవీందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి మల్లారెడ్డి, భూంరెడ్డి ,ఏఇఓ గంగ, పంచాయతీ కార్యదర్శిలు , ఫీల్డ్ అసిస్టెంట్లు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.
0 Comments