దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందాం ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి

 దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందాం  

-  ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి

న్యూస్ పవర్ , 2 జూన్ , ఇల్లంతకుంట :
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి,  ఈ సందర్భంగా  ఎంపీపీ  మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఇదే నెల 22 వ తారీకు వరకు రోజుకు ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవలని తెలిపారు.మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి వివరించాలని తెలిపారు.అధికారులు తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేస్తూ పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకుందాం అని తెలిపారు.ప్రతి ఒక్క అధికారులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మీర్జా, ఏ ఏం సీ చైర్మన్ మామిడి సంజీవ్, ప్యాక్ చైర్మన్ రొండ్ల తిరుపతిరెడ్డి, సెస్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి,ఎంపీటీసీ ఒగ్గు నరసయ్య,  గ్రంథాలయం డైరెక్టర్ శ్రీనివాస్, కో- ఆప్షన్ సభ్యుడు సలీం,ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments