ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అఖిలభారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా మండల యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పేద ప్రజల కోసం పరితపించే నాయకుడిని ఆయన కాశ్మీర్ నుండి కన్యకుమారి వరకు భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకోని మోడి చేస్తున్న ఆరాచక పాలన పై దేశాన్ని ఐక్యం చేసిన నాయకుడు అన్నారు. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని ప్రజలు ఆదరించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి, అంతగిరి బాలపోచయ్య, సినియర్ నాయకులు ఓగ్గు రమేష్, మండల బిసి సి సేల్ అధ్యక్షడు ప్రసాద్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ మైనర్టీ అధ్యక్షడు జమాల్ , గూడ నరెందర్, బిసి సి సేల్ జిల్ల నాయకుడు విజయ్ ,బడుగు లింగం,రజనీకాంత్, రాజు,బాలయ్య, శ్రీనివాస్, కుంటల శేఖర్,న్యాత బాబు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments