మిలినియం విద్యార్థుల "అపూర్వ" ఆత్మీయ సమ్మేళనం
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో 1999-2000 సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన మిలినియం మిస్సైల్స్ విద్యార్థులు అందరూ కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.ముందుగా పూర్వవిద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలను సందర్శించి,తరగతి గదిలో కూర్చొని పాఠశాలలో చదువుకున్న చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల ఆశీస్సులు తీసుకుని వారిని శాలువా,మెమోంటోతో ఘనంగా సన్మానించారు.అనంతరం ఆటపాటలతో,సాంస్కృతిక కార్యక్రమాలతో పూర్వవిద్యార్థులు సంతోషంగా గడిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామయ్య,భూమిరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,మంజుల,పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments