అక్రమంగా గంజాయి సేవిస్తూ,తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
సిరిసిల్ల రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఇల్లంతకుంట ఎస్.ఐ రాజేష్ తో కలసి వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ ఉపేందర్.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం,అనంతారం గ్రామాలోని ఒక పడుపడ్డ ఇంట్లో ముగ్గురు వ్యక్తులు వేములవాడ కు చెందినా ఒక వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి వారు గంజాయి తాగుతున్నరనే నమ్మదగిన సమాచారం మేరకు ఇల్లంతకుంట ఎస్.ఐ రాకేష్ తన సిబ్బంది తో కలసి గురువారం సాయంత్రం ముగ్గురిని పట్టుకొని వారి వద్ద నుండి 150 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తిని కూడా పట్టుకుంటాం అని సి.ఐ తెలియజేయడం జరిగింది..గంజాయి , ఇలాంటి మత్తు పదార్థాలను సరఫరా చెయ్యడం తగడం చట్ట రీత్యా నేరం గంజాయి సంబంధిత సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని కోరారు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అన్నారు.
గంజాయి లో పట్టు పడిన వారి వివరాలు.
A1. గజ్జెల మొక్షిత్ R/o ప్రకాశం రోడ్ కోరుట్ల జగిత్యాల జిల్లా
A2. బిట్ల పవన్, R/o కొలనూర్ గ్రామము కోనరావుపేట మండలం మరియు
A3. కర్రేవుల వంశీ, R/o పెద్దలింగాపూర్ గ్రామము ఇల్లంతకుంట మండలం
0 Comments