ఇల్లంతకుంట మండలాన్ని చొప్పదండి నియోజక వర్గంలో కలిపిన అధికారులు
రాష్ట ప్రభుత్వం కొన్ని బీసీ చేతివృత్తులు చేసుకొనే కులాల వారికి ఒక లక్ష రూపాయలు సాయం అందిస్తారని ప్రకటించడంతో అప్లై చేసుకోవడానికి ఎమ్మార్వో ఆఫీస్ , మీసేవ చుట్టూ తిరుగుతున్నారు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ వచ్చినవాళ్లు ఆన్లైన్లో అప్లై చేస్తూ ఉంటే ఇల్లంతకుంట మండలానికి చెందినవారు ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు మానకొండూరు నియోజకవర్గం సెలెక్ట్ చేసుకొంటే మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్క మండలం పేరు చూపించడం లేదు ఇల్లంతకుంట మండలానికి చెందినవారు అప్లై చేసేటప్పుడు చొప్పదండి నియోజకవర్గం సెలెక్ట్ చేసుకుంటే అందులో ఇల్లంతకుంట మండలం చూపిస్తుంది మళ్ళీ తర్వాత చొప్పదండి నియోజకవర్గం ప్లేసులో మానకొండూర్ సెలెక్ట్ అయినప్పటికీ ప్రింట్ తీసేటప్పుడు మాత్రం చొప్పదండి నియోజకవర్గం అని మాత్రమే చూపిస్తుంది
ఈ విధంగా రావడంతో ఇల్లంతకుంట మండలానికి చెందిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు అధికారులు తక్షణమే స్పందించి దీన్ని సరి చేయవలసిందిగా కోరుతున్నారు.
0 Comments