కష్ట జీవుల విముక్తికి ఏకైక మార్గం ఎర్రజెండా

కష్ట జీవుల విముక్తికి ఏకైక మార్గం ఎర్రజెండా

జనం న్యూస్ , 10 జూన్ ,  ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ  తరగతులను  సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ స్కైలాబ్ బాబు ప్రారంభించారు
 సిపిఎం అరుణ పతాకాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు మిట్టపల్లి రాజమల్లు ఆవిష్కరించారు అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ కేంద్ర బిజెపి సర్కార్ కార్పొరేట్ శక్తులకి 11 లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీ ఇచ్చిందని ప్రపంచంలో ఆదానిని అతిపెద్ద రెండో కుబేరుడుగాఎదిగాడని కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలుగా జీవిస్తున్న  40 కోట్ల మందికూలీలకు కేవలం 60వేల కోట్ల రూ. లు  మాత్రమే బడ్జెట్ లో కేటాయించిందని చెప్పారు ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానం నీటి మూటగా మార్చిందన్నారు 44కార్మిక చట్టాలను రద్దు చేసి 4లేబర్ కోడ్ లు తీసుకొచ్చిందన్నారు ఈ కోడ్ లు కోటీశ్వర్లకు మేలు చేస్తాయని చెప్పారు రాజ్యాంగం రద్దు చేయడానికి కుట్రలు చేస్తుందన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నిoచడాన్ని బీజేపీ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తుందన్నారు. ఇది దేశ సమైక్యతకు నష్టం అన్నారు. ఒరిస్సా బలాసోర్ రైలు దుర్ఘటనకు మోడీ సర్కారు రైల్వే ప్రైవేటీకరణ విధానాలే కారణమని చెప్పారు రైల్వే లో3.30లక్షల ఖాళీ ఉద్యోగాలు సిగ్నల్ వ్యవస్థను ఆధునీకరించకపోవడం, మోడీ రైల్వేలను అమ్మడం వంటి దుష్ట విధానాలే కారణమన్నారు .రాష్ట్రపతిని పార్లమెంట్ భవన ప్రారంభానికి ఆహ్వానించకపోవడం ఓ మహిళ ఆదివాసీ బిడ్డను అవమానించారని చెప్పారు రాష్ట్రంలో పేదలకు ఇల్లు స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఇప్పటికే 26 జిల్లాల్లో 61 కేంద్రాలలో సీపీఎం నాయకత్వంలో పేదల గుడిసెలు వేసుకున్నారని వారికి 58 59 జీవోలు ప్రకారంగా పట్టాలివ్వాలన్నారు. రైతుల ధాన్యం కొనుగోలులో జాప్యంతో పాటు  తూకంలో తేడా వస్తుందని చెప్పారు. ప్రతీ గింజ కొంటామన్నా సీఎం  వాగ్దానం ప్రకారం కొనుగోలు చేయాలన్నారు.
మూఢవిశ్వాసాలు శాస్త్రీ అవగాహన అనే అంశంపై విజ్ఞాన దర్శిని రాష్ట్ర కన్వీనర్ టి రమేష్ క్లాస్ బోధించారు రెండో పూట మతం మతోన్మాదం అనే అంశంపై రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పిట్టల రవి క్లాస్ బోధించారు సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేష్ ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.
 సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గన్నేరం నర్సయ్య ఎగమంటి ఎల్లారెడ్డి ,కోడం రమణ ,గురిజాల శ్రీధర్ మల్లారపు ప్రశాంత్ ,
శ్రీరామ్ సదానందం వివిధ ప్రజాసంఘాల నాయకులు మోర అజయ్ చిలుక బాబు మంద అనిల్, సిరిమల సత్యం బిక్షపతి, రాములు శ్రీనివాస్  వసంత తదితరులు పాల్గొన్నారు 


Post a Comment

0 Comments