బాల బాలికల్లో పౌష్ఠికాహార లోపాలను అధిగమించాలి


బాల బాలికల్లో పౌష్ఠికాహార లోపాలను అధిగమించాలి
జనం న్యూస్, 10 జూన్ , ఇల్లంతకుంట :
 హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో  ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు పౌష్ఠికాహారం ఆవశ్యకత పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ కో ఆర్డినేటర్ లు ఎనగందుల పరమేశ్వర్, దామ కవితలు పాల్గొని మాట్లాడినారు. ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ బాల బాలికల్లో పౌష్ఠికాహారలోపాల్ని అధిగమించేందుకు ప్రతి ఒకరు కృషి చేయాలని అన్నారు.ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాల ద్వారా పాలు, గుడ్డు, బాలామృతం అందిస్తుందని తెలిపారు. బాలింతలు సరైన అవగాహన పెంచుకొని వాటిని సక్రమంగా వినియోగిస్తే పౌష్ఠికాహారం లోపాలు రావని అన్నారు.గర్భిణీ స్త్రీలు అనేక అపోహలతో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఆశావహ దృక్పథంతో ఆలోచనలు చేస్తే శిశువు ఎదుగుదల బాగుంటుదని అన్నారు.
సుఖ ప్రసవాలను గురించి ప్రస్తావిస్తూ ఆపరేషన్ల ద్వారా మహిళల్లో, పిల్లల్లో అనేక శారీరక, మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం వుందని అన్నారు. సుఖప్రసవాలకు మానసికంగా సిద్ధం కావాలని కోరారు.
బాలలకు హక్కులు ఉంటాయని తెలుపుతూ పిల్లల ను క్రమపద్ధతిలో తీర్చిదిద్దే గొప్ప అవకాశం మహిళలకే వుంటుందని అన్నారు.
ఈ సంద్భంగా బాలల హక్కుల గురించి వివరించారు.
బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మహిళకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బిల్లవెని పర్షరాం, ఉప సర్పంచ్ బతిని కావ్యస్వామి, అంగన్వాడీ టీచర్ స్వప్న, ఆశా కార్యకర్త డి. ఏల్లవ్వ మరియు మహిళలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments