JSON Variables

క్రమశిక్షణ,నిబద్ధతతో ప్రజల మన్నలను పొందేలా పని చేయాలి,ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

క్రమశిక్షణ,నిబద్ధతతో ప్రజల మన్నలను పొందేలా పని చేయాలి,ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి,నిత్య జీవనంలో యోగా, వాకింగ్ ఒక భాగం చేసుకోవాలి,రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే IPS 
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో  జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ ,సివిల్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ గారు హాజరై గౌరవ వందనం స్వీకరించి తరువాత సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్,సిబ్బంది ప్రదర్శనని పరిశీలించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి చేయాలని,సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినడం మానివేయాలని. రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేసుకోవాలని ఎస్పీ గారు తెలిపారు.వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ,యూనిటీగా ఉండడం, ఫిజికల్ ఫిట్నెస్ కి ఉపయోగపడుతుందన్నారు.క్రమశిక్షణ తో డ్యూటీలు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందేలాగా పనిచేస్తూ పోలీస్ శాఖకి, జిల్లా కి మంచి పేరు తెచ్చే లాగా పని చేయాలని సిబ్బంది కి ఎలాంటి సమస్యలు ఉన్నా సర్వీస్ కి సంబంధించి సమస్యలు ఉన్నా HRMS లోని గ్రీవేన్స్ ద్వారా తమ దృష్టికి తీసుకరవలని సమస్యల పరిష్కరనికి కృషి చేస్తామని అన్నారు..

 ఈ పరేడ్ లో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ లు కుమార స్వామి,రజినీకాంత్, యాదగిరి, సి.ఐ లు అనిల్ కుమార్, ఉపేంద్, నవీన్ కుమార్, లింగమూర్తి, ఎస్.ఐ లు ఆర్.ఎస్.ఐ లు,ఆర్ముడ్ సిబ్బంది, సివిల్ సిబ్బంది పాల్గొన్నారు...
Telangana State Police

Post a Comment

0 Comments