JSON Variables

ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట. మండలం.
భారత రాజ్యాంగ పితామహుడు
అన్నగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్

సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి
టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి
 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలో డిసెంబర్ 6వ తేదీన ‘మహాపరినిర్వాన్ దివస్’ ఘనంగా  జరుపుకున్నారు.     
               ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఎస్సీ మాల సంఘం ఆధ్వర్యంలో  వేరువేరుగా సోమవారం డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి, ఆయనకు నివాళులు   అర్పించారు..
         ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి  వెంకట్ రెడ్డి మాట్లాడుతూ
అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్, భారత రాజ్యాంగ పితామహుడిగా ఖ్యాతి కెక్కాడని ఆయన 6 డిసెంబర్ 1956న కన్నుమూశారని  డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్, ‘బాబాసాహెబ్’గా ప్రాచుర్యాన్ని పొందారని అన్నారు. 
          టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రసిడెంట్ బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ
•బి.ఆర్.అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891న మధ్యప్రదేశ్ లోని మిలిటరీ కంటోన్మెంట్ పట్టణంలో, మహర్ సామాజిక వర్గంలో జన్మించారన్నారు  న్యాయశాస్త్ర కోవిదుడని, ఆర్ధికవేత్త, రాజకీయ నేత మరియు సామాజిక సంఘ సంస్కర్త అయిన అంబేద్కర్ ఆధునిక బౌద్ధ ఉద్యమానికి ఊపిరులూది దళితులు, మహిళలు మరియు కార్మికుల పై వివక్షతకు వ్యతిరేకంగా    పోరాడారని
ఆయన స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా వ్యవహరించారని. ఆయన భారత రాజ్యాంగ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారని ఆయన కొనియాడారు
 ఆయన 1956లో బౌద్ధమతమును స్వీకరించారని.
• అంబేద్కర్ 1990లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ అవార్డును మరణాంతరం పొందారన్నారు.
           రాజ్యాంగం వలన ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళలు ఉన్నత వర్గాలను బీసీలు రిజర్వేషన్లు పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు
        ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ప్రెసిడెంట్ గుండారపు కృష్ణా రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల  లక్ష్మణ్ . సింగిల్విండో డైరెక్టర్  నేవూరి వెంకట నరసింహ రెడ్డి గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు దొనుకుల   కళ్యాణ్. మహిళా అధ్యక్షురాలు శ్యామ మంజుల టిఆర్ఎస్ పార్టీ  నాయకులు మేగి నరసయ్య. ఎనగందుల గణేష్  ఉదయ్ మహమ్మద్ అబ్జల్ .మొహమ్మద్ సైఫ్.  డేవిడ్ .. ఎనగందుల బాబు ..ఎరుపుల తిరుమల అంగూరి కాంతారావు.ఎస్సీ మాల సంఘం అద్యక్షులు బురుక శ్రీ నివాస్.బిజెపి పట్టణ అద్యక్షులు నేవూరి శ్రీ నివాస్ రెడ్డి.  నాయకులు కొర్రి ప్రమోద్. రేస్ జగన్. కె రమేష్. కొత్త చెన్నయ్య. రేసు గణేష్. లింగాల రాజయ్య.  తదితరులు పాల్గొని ఆంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Post a Comment

0 Comments