JSON Variables

అన్నదాతలు ఆలోచించండి ఆరుతడి ని సాగు చేయండి

ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్ రాజన్న సిరిసిల్ల జిల్లా       ముస్తాబాద్ లో ప్రెస్మీట్       అన్నదాతలు ఆలోచించండి
ఆరుతడి ని సాగు చేయండి
మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు గారు
---------------------------------------
యాసంగి లో అన్నదాతలు ప్రభుత్వం సూచించిన విధంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు అన్నారు శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు కేంద్రం యాసంగి లో వరి కొనుగోలు చేయడం లేదని ఖరాఖండీగా చెప్పడం తో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రచారం చేస్తోందన్నారు ఆరుతడి పంటలతో భూసారం పెరుగుతుందని పంట మార్పిడి తో పప్పు దినుసులు నూనె గింజల ఉత్పత్తి తో ధరలు సమతుల్యంగా ఉంటాయని అన్నారు కొంత మంది రైతులు వరి నారు వేస్తున్నారు యాసంగి లో వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పాటించి ఆరుతడి పంటలు చేయాలని పిలుపునిచ్చారు. ఆరు కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేయవద్దని కోరారు రాష్ట్రప్రభుత్వ ప్రచారాన్ని పెడచెవిన పెట్టి వడ్లు పండిస్తే కొనుగోలు బాధ్యత ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు కొంతమంది రైతులు యాసంగి లో వడ్ల కొనుగోలు  లో రైస్ మిల్లు లతో అంగీకారం* *కుదుర్చుకున్నారని తెలుస్తుందని భవిష్యత్తులో ఈ విషయంలో పూర్తి బాధ్యత రైతులే వహించాలన్నారు ఇకనైనా అన్నదాతలు ఆలోచించి ఆరుతడి పంటలైన మినుములు నువ్వులు పొద్దుతిరుగుడు ఇతర పంటలు సాగు చేయాలని కోరారు ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు సురేందర్ రావు పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ నేతలు చెవులు మల్లేశం* *తదితరులు పాల్గొన్నారు*

Post a Comment

0 Comments