JSON Variables

బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా లోహ గిరిజన గ్రామంలో దాతల సహకారంతో మహా అన్నదానం దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ

బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా లోహ గిరిజన గ్రామంలో దాతల సహకారంతో మహా అన్నదానం దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ
- ట్రస్టు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమం
- తమకు అందుతున్న సేవలపై లోహ గిరిజనుల ఆనందం
- లోహకు రోడ్డు, కల్వర్టులు నిర్మించాలని గ్రామస్తుల విన్నపం

బెల్లంపల్లి: బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని లోహ గిరిజన గ్రామంలో మహా అన్నదానం నిర్వహించడంతోపాటు గ్రామం మొత్తానికి చలికాలం నేపథ్యంలో దుప్పట్లు, స్వెట్టర్లు అందజేశారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం లోహ అనే మారుమూల ప్రాంతం లో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అభివృద్ధికి చాలా వెనుకబడి ఉన్న గ్రామ ప్రజలకు అన్నదానం నిర్వహించారు. అలాగే కొండ ప్రాంతంలో ఉన్న లోహ గిరిజన గ్రామం చలి గుప్పిట్లో మగ్గకుండా ఆ గ్రామ ప్రజలందరికీ దుప్పట్లను మరియు స్వెట్టర్లను శనివారం అందజేశారు.

రోడ్డు వేయండి, కల్వర్టులు నిర్మించండి : లోహ గ్రామస్తుల విన్నపం
ఈ సందర్భంగా లోహ గ్రామస్తులు సాయి సేవా ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని ట్రస్ట్ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్డు లేని కారణంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామానికి రోడ్డు సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఈ సందర్భంగా వారిని కోరారు. అలాగే తమ గ్రామానికి రావాలన్నా, గ్రామం నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్లాలన్నా 8 వాగులు దాటవలసి ఉంటుందని, ఇది చాలా కష్టంతో కూడుకొని ఉంటుందని తెలిపారు. తమ ఈ కష్టం తీర్చడానికి 8 వాగులపై కల్వర్టులు నిర్మించాలని నిర్మించాలని లోహ గ్రామస్తులు సాయి సేవా ట్రస్ట్ వారిని కోరారు.

గిరిజనులకు సేవ చేయడం ఆనందంగా ఉంది
మారుమూల గిరిజన గ్రామం అయినా లోహ గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో   సర్పంచ్ ఎల్కరి సంజీవ్, ఉప సర్పంచ్ ఎల్కరి దామోదర్, వార్డు మెంబెర్ మడె మందునక్క, జోగయ్య, ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు మోటపలుకుల తిరుపతి కేడిక శ్రీకాంత్ భట్టు సాయి కృష్ణ దుర్గం మారుతీ జక్కం నాగమణి తిరుపతి సాగల సదానందం దుర్గం దేవాజీ దుర్గం కేదర్ తాళ్ల తులసిరామ్ గ్రామీణ చైతన్య సేవాసమితి దుబ్బుల దిలీప్ , లోహ గిరిజన గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments